
తరైప్పడై చిత్రంలో సన్నివేశం
తమిళసినిమా: స్టోనెక్స్ పతాకంపై పీబీ వేల్ మురుగన్ నిర్మిస్తున్న చిత్రం తరైప్పడై.. నటుడు ప్రజన్, విజయ్ విశ్వ, లొల్లుసభ జీవా హీరోలుగా నటిస్తున్న ఇందులో షాలిని, మేఘనా సిద్ధి, ధన్య హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కళింగ నావల్, బ్రహ్మపుత్ర చిత్రాల ఫేమ్ రామ్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ తరైప్పడై చిత్రం కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. అన్ని వర్గాల వారు చూసి ఆనందించే విధంగా పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాల్లో నిర్వహించినట్లు చెప్పారు. ఇందులోని పోరాట సన్నివేశాలను ఇటీవలే భారీఎత్తున చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలో చిత్ర ఆడియో విడుదల తేదీని అధికారికంగా ప్రకటింనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి మనోజ్ కుమార్ బాబు, సురేష్ కుమార్ సుందరం ఛాయాగ్రహణం అందిస్తున్నారు.