టీటీడీ ఆలయంలో శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు
అన్నామలై మార్పునకు పట్టు
గణపయ్య నిమజ్జనానికి సర్వం సిద్ధం
● ఢిల్లీకి అన్నాడీఎంకే బృందం ● దక్కని అమిత్ షా అపాయింట్‌మెంట్ ● నడ్డాకు ఫిర్యాదు
రాష్ట్రంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పెరటాసి మాసం తొలి శనివారం సందర్భంగా రాష్ట్రంలోని పెరుమాల్ ఆలయాలు భక్తులతో కిట కిటలాడాయి. ఆలయాల్లో విద్యుత్ దీపాలంకరణలు ఆకట్టుకున్నాయి. ఇక భక్తుల రద్దీ పెరగడంతో గోవింద నామస్మరణ మారుమోగింది.
సాక్షి చైన్నె: ఆధ్యాత్మికతకు పేరుగాంచిన తమిళనాడులో వైష్ణవ, శైవ క్షేత్రాలు కోకొల్లలు. ఫలితంగా పెరటాసి మాసం వచ్చిందంటే చాలు ఇక్కడి ఆలయాల్లో వేడుకలు కనులు పండువగా సాగుతాయి. తిరుచ్చి శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం, రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం, శ్రీవిళ్లి పుత్తూరులోని ఆండాల్‌అమ్మవారి ఆలయం, ట్రిప్లికేన్‌లోని పార్థసారథి స్వామి ఆలయం, తిరువొత్తియూరులోని కల్యాణ వరద రాజ పెరుమాల్ ఆలయం సహా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో భక్తిభావం మిన్నంటుంది. పెరుమాళ్‌ను కొలిచే భక్తులు మాల ధారణ చేసి వ్రతాలు ఆచరిస్తారు. నిష్టతో ఈనెలంతా పెరుమాల్‌సేవలో నిమగ్నమవుతారు. ఈ పరిస్థితుల్లో పెరటాసి నెలలో తొలి శనివారం భక్తులు స్వామివారి స్మరణలతో ముందుకు సాగారు. కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తరించారు.
శ్రీవారి సన్నిధిలో..
చైన్నె టీనగర్ వెంకటనారాయణ రోడ్డులోని తిరుమల తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రం ఆవరణలో కొలువు దీరిన శ్రీవారి ఆలయంలో ఉదయం నుంచి విశిష్ట పూజలు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారికి అభిషేకాది పూజలు, అలంకరణలు జరిగాయి. పచ్చని అరటి తోరణాలతో ఆలయం పరిసరాలను కనువిందు చేస్తూ సుందరంగా తీర్చిదిద్దారు. వేకువ జాము నుంచే భక్తులు ఆలయానికి పెద్దఎత్తున చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టీటీడీ అధికారులు చర్యలు చేపట్టారు.
జార్జిటౌన్‌లో పెరుమాల్‌కు ప్రత్యేక పూజలు
చైన్నె జార్జిటౌన్ కుమారప్ప మేస్త్రి వీధిలో మిర్చి వ్యాపారుల ఆధ్వర్యంలో 2వ వార్షిక పెరటాసి శనివారం పూజలు వైభవోపేతంగా నిర్వహించారు. పురోహితులు వెంకటేశ్వర్ల శాస్త్రి బృందం శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజల్లో కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పుష్పయాగం, హారతి పూజలు చేశారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం, ప్రసాదాలను అందజేశారు. పెరటాసి పూజల నిర్వాహకులు ఏ.ఆది నారాయణ, ఎస్. మల్లికార్జున , జి.అనిల్ కుమార్, బి.శేఖర్, టీజీ రమేష్, కె రవి, దయాకర్, శ్రీనివాసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభం
చైన్నె ట్రిప్లికేన్‌లోని పార్థసారథి స్వామి ఆలయంలో హిందూ దేవదాయ శాఖ, పర్యాటక శాఖల ఆధ్వర్యంలో పెరటాసి మాస వైష్ణవ ఆలయల ఆధ్యాత్మిక పర్యాటనకు శ్రీకారం చుట్టారు. దేవదాయ శాఖమంత్రి పీకే శేఖర్‌బాబు జెండా ఊపియాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పెరటాసి మాసం ఎంతో పవిత్రమైందని, ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటూ పెరుమాల్‌ను ఆరాధించటం జరుగుతోందన్నారు. అందుకే ఈ మాసంలో ఈ యాత్ర ద్వారా ఆరు వైష్ణవ ఆలయాల పర్యాటక ఏర్పాటు చేశామన్నారు. ఉదయం10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ఈయాత్ర ముగుస్తుందని అన్నారు. చైన్నెతో పాటు మదురై, తిరుచ్చి, తంజావూరు లలోనూ అక్కడి ఆలయాల సందర్శనార్థం ఆథ్యాత్మిక యాత్ర ప్రారంభమైందని తెలిపారు.
వేలూరు, తిరువణ్ణామలైలో..
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని పెరుమాళ్‌ఆలయాల్లో భక్తులతో కిటకిట లాడింది. వేలూరులోని టీటీడీ సమాచార కేంద్రం ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు చేసి వివిధ పుష్పాలతో అలంకరించారు. అదే విదంగా ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. ఇదిలా ఉండగా వేలూరుకు చెందిన ఒక భక్తుడు స్వామి వారికి 375 కిలోలతో అతి పెద్ద లడ్డు తయారు చేసి ఆలయంలోని స్వామి వారికి కానుకగా సమర్పించాడు. అనంతరం ఆలయ నిర్వహకులు ఆ లడ్డును భక్తులకు ప్రసాదంగా అందజేశారు. అదే విధంగా వేలపాడిలోని వరదరాజ పెరుమాల్ ఆలయం, అరసంబట్టు పెరుమాల్ ఆలయం, బ్రహ్మపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోను భక్తులతో కిటకిటలాడింది. అదే విధంగా వాలాజలోని శ్రీ దన్వంతరి ఆరోగ్య పీఠంలో పీఠాధిపతి డాక్టర్ మురళీధర స్వామిజీ అద్వర్యంలో శ్రీనివాస పెరుమాల్‌కు ప్రత్యేక అభిషేకాలు, పుష్పాలంకరణలు చేశారు. వేలూరు జిల్లాతో పాటు తిరుపత్తూరు, రాణిపేట, తిరువణ్ణామలై జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి.
న్యూస్‌రీల్
పెరుమాల్ సన్నిఽధికి పోటెత్తిన భక్తులు
రాష్ట్రవ్యాప్తంగా పెరటాసి శనివారం పూజలు
టీ నగర్ శ్రీవారి ఆలయంలో భారీ రద్దీ
తిరువళ్లూరు వీరరాఘవ ఆలయంలో..
తిరువళ్లూరు: పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ వైద్యవీరరాఘవుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. నాలుగు గంటల పాటు క్యూలలో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి తిరుమంజనం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. మూలవర్‌తో పాటు ఉత్సవమూర్తులు ఒకే ప్రాంతం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా నర్సింగాపురంలోని శ్రీలక్ష్మీనరసింహపెరుమాల్ ఆలయంలో ఆలయంలోనూ పూజ లను నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకున్నారు.
బారులు తీరిన భక్తులు, ప్రత్యేక అలంకరణలో వీరరాఘవస్వామి
ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తున్న మంత్రి శేఖర్‌బాబు
పెరటాసితొలి శనివారం పూజల్లో తెలుగు ప్రజలు
పెరుమాళ్ ఆకారంలోని బొప్పాయి
అవార్డులు అందజేస్తున్న నిర్వాహకులు


