
మాట్లాడుతున్న పాండియరాజన్
కొరుక్కుపేట: ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా మా సంస్థ ముందుకెళుతోందని మాఫాయ్ గ్రూప్ అధినేత, మాజీ మంత్రి పాండ్యరాజన్ పేర్కొన్నారు. గురువారం ఏర్పాటైన సమావేశంలో మాఫాయ్ (సియల్ కొత్తగా రెండు రకాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో సాంకేతికతను వినియోగిస్తూ హెచ్‌ఆర్ ఫిర్యాదులను పరిష్కరించే విధంగా ఈజీకామ్ అలాగే నైపుణ్యాలను మెరుగుపరుస్తూ నాయకులను తయారు చేసే విధంగా ట్రాన్సిషన్ కోచింగ్ అకాడమీని ప్రారంభించినట్లు పాండ్యరాజన్ ప్రకటించారు. మాఫాయ్ ఎండీ రాజీవ్‌కృష్ణన్ పాల్గొన్నారు.