
ఈమె భర్త కేశవమూర్తి మృతిచెందాడు. జ్యోతి కుమార్తెతో కలిసి ఉంటోంది. జ్యోతి అంగన్‌వాడీ ఉద్యోగి.
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. కృష్ణగిరి జిల్లా సూలగిరి సమీపం పెరిగై కులదాసపురం ప్రాంతానికి చెందిన జ్యోతి (36). ఈమె భర్త కేశవమూర్తి మృతిచెందాడు. జ్యోతి కుమార్తెతో కలిసి ఉంటోంది. జ్యోతి అంగన్‌వాడీ ఉద్యోగి. ఈ క్రమంలో మహారాజపురం ప్రాంతానికి చెందిన వెంకటేష్ (35)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం జ్యోతి అక్క కుమారుడు హరీష్‌కు తెలిసింది. దీంతో హరీష్ జ్యోతి, వెంకటేష్‌లను మందలించాడు. కానీ ఇద్దరూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈక్రమంలో సోమవారం సాయంత్రం జ్యోతి ఇంటికి హరీష్ వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ జ్యోతి, వెంకటేష్ ఒంటిరిగా ఉండడం చూసి హరీష్ గొడవపడ్డాడు.
వెంకటేష్, హరీష్ ఘర్షణ పడ్డారు. ఘర్షణలో గాయపడిన వెంకటేష్‌ను హొసూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పేరిగై పోలీసులు అక్కడికి వెళ్లి వెంకటేష్ మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హరీష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.