
అధికారులతో స్థానికుల వాగ్వాదం
తిరువళ్లూరు: ఆలయానికి వెనుక ప్రైవేటు వ్యక్తులు నిర్మించిన మరుగుదొడ్డిని ఉద్రిక్తత నడుమ అధికారులు తొలగించారు. తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం గ్రామంలో శ్రీకృష్ణుడి ఆలయం వుంది. ఈ నేపథ్యంలో ఆలయానికి వెనుక భాగాన్ని ఓ వ్యక్తి ఆక్రమించుకుని వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించారు. అయితే గర్బగుడికి నేరుగా మరుగుదొడ్ది, సెప్టిక్ ట్యాంక్ నిర్మించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆరోపించిన స్థానికులు గత సోమవారం గ్రీవెన్స్‌డేలో వినతి పత్రం సమర్పించారు. ఈ వినతిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ మదియళగన్‌ను కలెక్టర్ ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం అక్కడికి వెళ్లి భూసర్వే నిర్వహించారు. జేసీబీతో తొలగించారు. ఈ సమయంలోఉద్రిక్తత నెలకొంది. కొంతమందిని మరుగుదొడ్డిని తొలగించాలని, మరికొందరు తొలగించకూడదని రెవెన్యూ అఽధికారులతో వాగ్వాదానికి దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల బందోబస్తు నడుమ అధికారులు ఆక్రమణలను తొలగించారు.