
కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి నిరసన
వేలూరు: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఎస్‌ఎన్‌ఎల్ కార్మికులు సంఘం, పింఛన్ల దారుల సంఘం, కాంట్రాక్టు కార్మికుల సంఘం సంయుక్తంగా ఆ కార్యాలయం ఎదుట మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. నిరసనకు బీఎస్‌ఎన్‌ఎల్ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి మారిముత్తు అధ్యక్షత వహించారు. కార్మికులు మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌లో 4జీ, 5జీ సేవలను ప్రవేశ పెట్టాలని, 2017వ సంవత్సరం నుంచి వేతన పెంపును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంఘాలను చర్చలకు ఆమ్వానించాలని, గత 15 ఏళ్లుగా పనిచేస్తూ సీనియారిటీ ఉన్నప్పటికీ పదవి విరమణ ఇంత వరకు ఎవరికీ ఇవ్వలేదని వీటిని పరిశీలించి సీనియారిటీ జాబితా ప్రకారం పదోన్నతులు కల్పించాలని, కార్మికులకు సిమ్ కార్డులు విక్రయం చేయాలని, టార్గెట్‌లు పెట్టడం నిలిపి వేయాలనే డిమాండ్‌లు పరిష్కరించాలని కార్యాలయం ఎదుట మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్‌ఎఫ్‌టీఈ సంఘం జిల్లా కార్యదర్శి లోకనాథన్, రిటైర్ట్ కార్మికుల సంఘం జిల్లా కార్యదర్శి ఏలుమలై పాల్గొన్నారు.