
లక్ష్మణ్ శివరామకృష్ణన్
కొరుక్కుపేట: తమిళనాడుకు చెందిన భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ 1983లో అరంగేట్రం చేశారు. అతను 1987లో తన చివరి మ్యాచ్ ఆడిన తర్వాత రిటైర్డ్ అయ్యారు. 2000 నుంచి అంతర్జాతీయ క్రికెట్ వ్యాఖ్యాతగా పనిచేశారు. అలాగే 2017 నుంచి తమిళ వ్యాఖ్యాతగా కూడా చేస్తూ వచ్చారు. ఈక్రమంలో ఆయన 2020 డిసెంబర్‌లో అప్పటి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్ సమక్షంలో బీజేపీలో చేశారు. ప్రస్తుతం లక్ష్మణ్ శివరామకృష్ణన్‌కు రాష్ట్ర బీజేపీలో కొత్త పదవి అందించారు. తమిళనాడు బీజేపీ స్పోర్ట్స్ స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చినట్టు తమిళనాడు బీజేపీ స్పోర్ట్స్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెల్ స్టేట్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ ఎస్ అమరప్రసాద్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.