మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామికి అర్చకులు విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకాలు , హోమశాలలో నిత్యహోమం చేపట్టారు. అనంతరం నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేశారు. తర్వాత విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయంలో నీరా జన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, ఆల య అర్చకులు రామాచార్యులు , పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు పాల్గొన్నారు.


