మొక్కల లక్ష్యం 44.36 లక్షలు | - | Sakshi
Sakshi News home page

మొక్కల లక్ష్యం 44.36 లక్షలు

Mar 30 2026 7:19 AM | Updated on Mar 30 2026 7:19 AM

భానుపురి (సూర్యాపేట) : అటవీ విస్తీర్ణం పెంచేందుకు చేపట్టిన వన మహోత్సవానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. రానున్న వానాకాలం జిల్లావ్యాప్తంగా నాటేందుకు కావాల్సిన మొక్కల పెంపకానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 44.36 లక్షల మొక్కలు పెంచాలని టార్గెట్‌ విధించగా అన్ని మండలాల్లో ఉపాధి హామీ కూలీలతో అవసరమైన మొక్కల పెంపకం చేపడుతున్నారు.

మండలాలకు లక్ష్యాలు కేటాయించి..

జిల్లాలోని 486 గ్రామపంచాయతీలకు గాను 485 వన నర్సరీలను ఏర్పాటు చేశారు. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన లక్ష్యంలో ఆయా మండలాల వారీగా జిల్లా యంత్రాంగం మొక్కల పెంపకానికి లక్ష్యాలను కేటాయించారు. ఇందులో మూడు జాతులకు చెందిన పలు రకాల మొక్కలను పెంచనున్నారు. పెన్‌పహాడ్‌ మండలంలో అత్యధికంగా 2.89 లక్షలు, సూర్యాపేట మండలంలో 2.67 లక్షల మొక్కలు పెంచాల్సి ఉంది.

పంచాయతీలకు సంరక్షణ బాధ్యత

జిల్లాలో మొక్కల పెంపకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల మట్టిని జల్లెడ పట్టించి కవర్లలో నింపుతున్నారు. మరికొన్నిచోట్ల విత్తనాలను సైతం విత్తగా మొలకెత్తాయి. ప్రధానంగా నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కల్లో ఉండే పలు రకాలను పెంచుతున్నారు. వీటి సంరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీలు చూస్తున్నాయి. ఏ గ్రామ పరిధిలో పెంచే మొక్కలను అక్కడే నాటేలా చూస్తున్నారు.

ఫ వనమహోత్సవానికి

సన్నద్ధమవుతున్న అధికారులు

ఫ 485 వన నర్సరీల ఏర్పాటు

ఫ ఉపాధిహామీ కూలీలతో ముమ్మరంగా మొక్కల పెంపకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement