రెండు గణితం ఎస్‌ఏ పోస్టులు మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రెండు గణితం ఎస్‌ఏ పోస్టులు మంజూరు చేయాలి

Mar 30 2026 7:19 AM | Updated on Mar 30 2026 7:19 AM

సూర్యాపేట : ప్రతి ఉన్నత పాఠశాలకు తప్పనిసరిగా రెండు గణితం ఎస్‌ఏ పోస్టులు మంజూరు చేయాలని, గణిత ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ మ్యాథమెటిక్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్‌ కోరారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని కాకతీయ కాన్సెప్ట్‌ స్కూల్‌లో గణిత ఫోరం జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంఎఫ్‌ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర పరిశీలకుడు కొరివి కృష్ణ, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి అడిగే సతీష్‌ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మండవ ఉపేందర్‌, ప్రధాన కార్యదర్శిగా జలగం పురుషోత్తం, ఆర్థిక కార్యదర్శిగా సురేందర్‌ రెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండా వెంకటేశ్వర్లు, టీఎంఎఫ్‌ మాజీ అధ్యక్షుడు నరేంద్ర స్వామి, మందాటి అశోక్‌, కోటేశ్వరరావు, కె.శ్యామ్‌ పాల్గొన్నారు.

ఆర్య వైశ్యులు సమాజసేవకులు

సూర్యాపేట : ఆర్యవైశ్యులు సమాజ సేవకులని, తాము జీవిస్తూనే పదిమందికి సహాయ సహకారాలు అందిస్తారని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం తెలిపారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని కిరాణా ఫ్యాన్సీ భవన్‌లో శ్రీ వాసవి సేవా సమితి జిల్లా ప్రథమ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా గౌరవ సలహాదారులు గోపారపు రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో శ్రీ వాసవి సేవా సమితి స్థాపించి అట్టడుగు వర్గాన ఉన్న ఆర్యవైశ్యులకు సేవలు అందిస్తోందన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం, శివాజీ మహారాజ్‌ విగ్రహన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవర శెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్‌ కుమార్‌, ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్‌, మహంకాళి ప్రణీత్‌, సహాయ కార్యదర్శి కర్నాటి కృష్ణ, కోట శివ, వీరవెల్లి విజయ శంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement