మిర్చికి తెగులు.. రైతుకు దిగులు | - | Sakshi
Sakshi News home page

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు

Feb 7 2026 3:04 PM | Updated on Feb 7 2026 3:04 PM

మిర్చ

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు

పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు

ఆత్మకూర్‌ (ఎస్‌) : జిల్లా వ్యాప్తంగా మిర్చి సాగు చేసిన రైతులకు తెగుళ్ల బెడద తప్పడం లేదు. గతేడాది మాదిరిగానే నల్లి, తామర పురుగు, ఆకు ముడత తెగుళ్లు సోకడంతో మిర్చి తోటలు ఎదుగుదల లోపించి కనిపిస్తున్నాయి. పూత, కాత లేకపోవడంతో దిగుబడులు పూర్తిగా పడిపోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. గతంలో దిగుబడులు ఉన్నా పండిన పంటకు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, ఈ ఏడాది దిగుబడి పూర్తిగా తగ్గి ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నామని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 4 వేలకుపైగా ఎకరాల్లో సాగు

జిల్లాలో ఈ సీజన్‌లో 6,554 ఎకరాల్లో రైతులు మిర్చిపంట సాగు చేస్తున్నారు. గతంలో 12వేల ఎకరాల వరకు ఎకరాలకుపైగా మిర్చి సాగు చేసినప్పటికీ ధర పడిపోవడంతోపాటు కూలీల రేట్లు పెరగడంతో చాలామంది రైతులు మిర్చి సాగును వదులుకున్నారు. మిర్చి బదులు మొక్కజొన్న, మినుములు, పెసర సాగు చేస్తున్నారు. కానీ కొందరు రైతులు మిర్చినే నమ్ముకుని సాగు చేస్తున్నప్పటికీ మిర్చి పంటకు నల్లి పురుగు, ఆకు ముడత, తామర పురుగు బెడద పట్టుకుంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా తెగుళ్లు అదుపులోకి రావడం లేదని రైతులు దిగులు చెందుతున్నారు.

గతేడాది మాదిరిగానే నల్లి, తామర పురుగుల బెడద

ఎన్ని మందులు పిచికారీ చేసినా అదుపులోకిరాని తెగుళ్లు

ఎదుగుదల లోపించి సరిగా కాతలేని చేలు

దిగుబడిపై రైతుల్లో ఆందోళన

ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఆత్మకూరు (ఎస్‌)మండలం రామోజీతండాకు చెందిన రైతు గుగులోతు రవి. ప్రస్తుత సీజన్‌లో ఈయన 1.15 ఎకరాల్లో దాదాపు రూ.80వేలు పెట్టుబడి పెట్టి మిర్చిపంట సాగు చేశాడు. ఇప్పటి వరకు ఒకేసారి పంట ఏరగా 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. ఇదే భూమిలో గతేడాది రూ.50వేలు పెట్టుబడి పెట్టి మిర్చిపంట సాగు చేయగా మొదటిసారి కాయలు కోయగా 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. అప్పట్లో క్వింటా మిర్చి రూ.13వేలు ఉండగా ఖర్చులు పోను లాభసాటిగానే ఉంది. కానీ ఈ సంవత్సరం క్వింటాకు రూ.19వేల ధర పలుకుతున్నప్పటికీ తెగుళ్ల బెడదతో దిగుబడి లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

మేళ్లచెరువు : మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభుశంభులింగేశ్వర స్వామి ఆలంలో శుక్రవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అన్నాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, మహాలింగార్చన, పుష్పార్చన అనంతరం తీర్థప్రసాద వినియోగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు.

మండలాల వారీగా జిల్లాలో మిర్చి సాగు ఇలా..

మండలం ఎకరాలు

ఆత్మకూరు(ఎస్‌) 154

చివ్వెంల 21

పెన్‌పహాడ్‌ 12

సూర్యాపేట 2.39

చింతలపాలెం 3,918

మట్టంపల్లి 1,290

పాలకవీడు 2.35

అనంతగిరి 1.16

మోతె 798

మునగాల 70.20

నడిగూడెం 13

జాజిరెడ్డిగూడెం 03

మద్దిరాల 99

నూతనకల్‌ 111

నాగారం 44

తిరుమలగిరి 1.20

తుంగతుర్తి 14

కౌలుకు తీసుకొని రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. ఈ సంవత్సరం నల్లి పురుగు ప్రభావంతో పైరంతా ముడత వచ్చి పూత రాలిపోతుంది. ఎన్ని మందులు కొట్టిన అదుపులోకి రావడం లేదు. కాపు అసలు లేదు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

– బానోతు శ్రీను, రామోజీతండా

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు 1
1/5

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు 2
2/5

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు 3
3/5

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు 4
4/5

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు 5
5/5

మిర్చికి తెగులు.. రైతుకు దిగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement