బీఆర్‌ఎస్ అంటేనే అభివృద్ధి
సూర్యాపేట టౌన్ : కాంగ్రెస్ అంటే కబ్జాలు, కూల్చివేతలని.. బీఆర్‌ఎస్ అంటే అభివృద్ధి, ప్రశాంత వాతావరణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని 16వ వార్డుతో పాటు పలు వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటేస్తే అవినీతి, దౌర్జన్యాలను పెంచి పోషించినట్లేనన్నారు. పదేళ్ల పాలనలో అభివృద్ధి, ప్రశాంతతకు బీఆర్‌ఎస్ పార్టీ కేరాఫ్‌గా నిలిచిందని తెలిపారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏం చేశారని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులే సిగ్గులేకుండా దోచుకుంటున్నారని, ప్రజలను మోసం చేసి దోచుకోవడం వాళ్లకు కొత్తేమీ కాదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో జగదీష్‌రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రచారంలో వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు.
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
బీఆర్‌ఎస్ అంటేనే అభివృద్ధి


