బాల్య వివాహాలను నిర్మూలించాలి
చివ్వెంల (సూర్యాపేట) : గ్రామాల్లో బాల్య వివాహాలను నిర్మూలించాలని, ఎవరైనా బాల్య వివాహాలు చేస్తున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్టా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎన్.అపూర్వ రవళి అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని చివ్వెంల గురుకుల పాఠశాలలో బాల్య వివాహాల నివారణపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలు చేయడం వల్ల చిన్న వయస్సులోనే అమ్మాయిలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బాలికల వయస్సు 18, బాలుర వయస్సు 21 నిండాకే వివాహం జరిపించరాదన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, నామినేటెడ్ సభ్యురాలు నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, కె.ప్రియదర్శిని, ప్రిన్సిపాల్ విద్యాసాగర్, వైస్ ప్రిన్సిపాల్ ఎస్.వెంకటేశ్వర్లు, కె.మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా కోర్టు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి


