సల్లోనిగూడెం, వంకమామిడిలో విషాదఛాయలు
భూదాన్‌పోచంపల్లి : మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భూదాన్‌పోచంపల్లి మండలం సల్లోనిగూడెం, వంకమామిడి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆ రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. సల్లోనిగూడేనికి చెందిన సామ లింగారెడ్డి బోరు బండిపై అదే గ్రామానికి చెందిన అంతటి శ్రీనివాస్‌గౌడ్(50), వంకమామిడి గ్రామానికి చెందిన మచ్చ సురేశ్(36) డ్రైవర్ కమ్ డ్రిల్లర్‌గా పనిచేస్తున్నారు. శనివారం బోరు బండిపై కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. శామీర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డు పైన కొద్ది దూరం రాగానే బోరు బండి కింద శబ్దం వస్తుండగా బండిని రోడ్డు పక్కన ఆపారు. కిందికి దిగి టార్చిలైట్ వేసుకొని చెక్ చేస్తుండగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బోరు బండిని ఢీకొట్టడంతో మచ్చ సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అంతటి శ్రీనివాస్‌గౌడ్ రెండు కాళ్లు విరిగిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు. పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు వారిద్దరి మృతదేహాలను మేడ్చల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు అంతటి శ్రీనివాస్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అతడి కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చిన తర్వాత మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. వంకమామిడి గ్రామానికి చెందిన మృతుడు మచ్చ సురేశ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదివారం రాత్రి సురేశ్ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. బోరు బండి యజమాని సామ లింగారెడ్డి మృతుల కుటుంబాలకు రూ.18లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు పెద్దమనుషుల సమక్షంలో అంగీకారం తెలిపాడు.
ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయా గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి
సల్లోనిగూడెం, వంకమామిడిలో విషాదఛాయలు


