బాల్య వివాహాలను అడ్డుకోవాలి
భువనగిరిటౌన్ : బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. జయ రాజు అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు ఆవరణలో వంద రోజుల బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాల్య వివాహాలు చేయడం వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించి అందుకు చట్టపరంగా తీసుకునే చర్యల గురించి చెప్పారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిదా, పోఫోక్సో కోర్టు స్పెషల్ జడ్జి మిలింద్ కాంబ్లీ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాధవీలత, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ,, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్యాంసుందర్, ప్రధాన జూని యర్ సివిల్ జడ్జి జి. స్వాతి, డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ వెంకటేశం, అసిస్టెంట్ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ రాజశేఖర్, నాగరాజు సాయి శ్రీనివాస్, సరిత తదితరులు పాల్గొన్నారు.


