విపత్తు సమయంలో సేవలందించాలి
భానుపురి (సూర్యాపేట) : విపత్తు సమయంలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వరదలు, పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై ఈ నెల 22న నిర్వహించనున్న ముందస్తు ప్రణాళికపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ డైరెక్టర్ సుధీర్‌బాల్, రాష్ట్ర ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. వరదలు, విపత్కర పరిస్థితుల్లో అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ శాఖలు అప్రమత్తంగా ఉండి తగిన విధంగా సాయం అందించాలన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వైపు వెళ్లాలి, ఉపశమన శిబిరం ఎక్కడ పెట్టాలనేది ముందుగానే చూసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, అదనపు ఎస్పీలు రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, పరిశ్రమలశౠఖ జీఎం సీతారాం, ఆర్డీఓలు సూర్యనారాయణ, వేణుమాధవ్, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీఎస్‌ఓ శోభన్‌బాబు, డీఎం రాము, పశు సంవర్ధకశాఖ అధికారి శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ ఈఈలు సీతారామయ్య, వెంకటయ్య, మాధవి, డీవైఎస్‌ఓ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


