కొలువుదీరనున్న పాలకవర్గాలు
22న మొదటి సమావేశం
కోదాడ: జిల్లా వ్యాప్తంగా మూడు దశల్లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలు బుధవారంతో పూర్తి అయ్యాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త పాలక వర్గాలు కొలువు దీరడానికి సిద్ధమవుతున్నాయి. దీని కోసం మొదట ఈ నెల 20వ తేదీని ఎంపిక చేసినప్పటికి ముహూర్తం బాగా లేదని విజ్ఞప్తులు రావడంతో ఈ నెల 22వ తేదీని జిల్లా అధికారులు ఖరారు చేశారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు కూడాపూర్తి కావడంతో పూర్తిస్థాయి పాలక వర్గాల చేత ఈ నెల 22న ప్రమాణం చేయించడానికి అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 486 పంచాయతీలు ఉండగా ఈ నెల 11న మొదటి విడత 159 పంచాయతీలకు, 14న రెండవ విడత 181 పంచాయతీలకు, 17న మూడవ విడత 146 పంచాయితీలకు ఎన్నికలు పూర్తి చేశారు. ఎన్నికలు మొత్తం పూర్తి అయిన రెండు రోజుల తరువాత మూడు విడతల్లో గెలుపొందిన అందరిని కలిపి ఈ నెల 22వ తేదీన ప్రమాణం చేయించడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు విడతల్లో గెలిచిన వార్డు సభ్యులు పరోక్ష పద్ధతిలో ఆయా గ్రామాలలో ఉపసర్పంచ్‌లను ఇప్పటికే ఎన్నుకున్నారు.
ఫ 22న ముహూర్తం ఖరారు
ఫ బాధ్యతలు చేపట్టనున్న
486 మంది సర్పంచ్‌లు
ఫ ఏర్పాట్లు చేస్తున్న పంచాయతీ అధికారులు
నూతనంగా సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా ఎన్నికై నవారు ఈ నెల 22వ తేదీన ఉదయం ఆయా పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే తొలి పంచాయతీ సమావేశంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి వీరి చేత నిబంధనల ప్రకారం ప్రమాణం చేయించిన అనంతరం ప్రమాణ పత్రంపై సంతకాలు చేసి అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం సర్పంచ్ అధ్యక్షతన జరగే సమావేశంలో గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.


