పల్లె పాలనకో పాఠం
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్నది. మూడు విడతల్లో పోలింగ్ పూర్తయింది. ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పల్లె పాలనపై అందరూ చర్చించుకుంటున్నారు. గ్రామ పాలనపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేలా 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో ఓ పాఠం చేర్చారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అధికారాలు, విధులు, బాధ్యతలు, ప్రజల కర్తవ్యం, ప్రజాస్వామ్యం తది తర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠ్యాంశంలో వివరాలు పొందుపర్చారు.
ఓటు హక్కు పదవీ బాధ్యతలు
గ్రామ సభ, సమస్యల పరిష్కారం, పౌరుల బాధ్యతలు తదితర అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించేలా వివరాలు చేర్చారు. గ్రామ పంచాయతీలకు ఆదాయం, వ్యయం, పన్నుల రకాలు, సర్పంచ్ కృషి చేస్తే గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ద వచ్చన్న సూచనలు ఉన్నాయి.పంచాయతీల పాలనపై విద్యార్థులు అవగాహన పెంచుకొని తల్లిదండ్రులకు వివరిస్తే ప్రజా సమస్యలు పరిష్కారం కావడంతో పాటు పారదర్శకమైన పాలన అందించ వచ్చు. పాఠ్యాంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే కాకుండా గ్రామ సభలు కూడా నిర్వహించి అవగాహన కల్పించారు.
ఫ గ్రామ స్థాయిలో విద్యార్థులకు
అవగాహన కల్పించేలా రూపకల్పన
ఫ 6వ తరగతి సాంఘిక
శాస్త్రంలో పాఠ్యాంశం
ఫ వివరంగా సర్పంచ్‌ల విధులు, బాధ్యతలు


