ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారు
మునగాల: మునగాలలో ఈనెల 14న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యే అండదండలతో ఎన్నిల ఫలితాలను తారుమారు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఆరోపించారు. మంగళవారం మునగాలలో బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి వేట నాగలక్ష్మి నివాసానికి చేరుకొని పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. మునగాల మేజర్ గ్రామపంచాయతీలో బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి వేట నాగలక్ష్మికి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి నల్లపాటి ప్రమీల కంటే మెజార్టీ ఓట్లు వచ్చినప్పటీకీ ప్రమీల భర్త శ్రీనివాస్ తన సతీమణి అప్రజాస్వామికంగా విజయం సాధించేలా ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి ఫలితాలను తారుమారు చేయించారని ధ్వజమెత్తారు. ఎన్నికల సిబ్బంది, పోలీస్ యంత్రాంగంతో కుమ్మకై ్క వ్యవహరించిన తీరుపై తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. అంగబలం, అర్ధబలంతో కాంగ్రెస్ నాయకులు అర్ధరాత్రి పోలీసులు, ఎన్నికల సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి ఫలితాలను తారుమారు చేసి ఐదుఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటింపజేయడం హాస్యాస్పదమన్నారు. రిటర్నింగ్ అధికారి, కోదాడ డీఎస్పీ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి, బీఆర్‌ఎస్‌కు చెందినవారిని ఓట్లు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. రీకౌంటింగ్ కోరినా అవకాశం ఇవ్వకుండా ఎన్నికల అధికారి ఏకపక్షంగా ప్రమీల గెలిచినట్లు ప్రకటించారన్నారు. ఈ విషయమై కలెక్టర్, ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయడమే కాక, బీఆర్‌ఎస్ లీగల్ సెల్‌ను ఆశ్రయించి నాగలక్ష్మి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నైతిక విజయం వేట నాగలక్ష్మిదే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్, నాయకులు సుంకర అజయ్‌కుమార్ , కందిబండ సత్యనారాయణ, ఎల్‌పి.రామయ్య, ఎల్.నాగబాబు, వేట శివాజీ, నల్లపాటి నాగేశ్వరరావు, దొంగరి శ్రీనివాసరావు, సీతరాములు, వసంత్‌కుమార్, అమర్‌నాథ్, జానీ, సైదా, వెంకన్న పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే
మల్లయ్య యాదవ్ ఆరోపణ


