మిట్టగూడెంలో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రం
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం పరిధిలోని మిట్టగూడెంలో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వేపల సింగారం గ్రామంలోని 14 వార్డుల్లో 4,396 మంది ఓటర్లు ఉన్నారని, ఓటు వేసేందుకు వచ్చిన వారికి అన్ని మౌళిక వసతులు కల్పించాలన్నారు. దివ్యాంగులకు వీల్ చైర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటేయాలని కోరారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలందరూ సహకరించాలన్నారు. పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్టీఓ శ్రీనివాసులు, ఎంపీడీఓ సుమంత్ రెడ్డి, తహసీల్దార్ కవిత, ఎంపీఓ లావణ్య, పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, ఆర్‌ఓలు, ఎన్నికల సిబ్బంది తదితరులు ఉన్నారు.
మిట్టగూడెంలో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రం


