సమస్యలు పరిష్కరించాలి
మఠంపల్లి: ఆలయాల్లో భక్తులకు సేవలందిస్తున్న అర్చక, ఉద్యోగ, సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ డీవీఎస్‌శర్మ, దేవాదాయశాఖ వెల్ఫేర్‌బోర్డు మెంబర్ శ్రవణ్‌కుమారాచార్యులు కోరారు. మంగళవారం మట్టపల్లిలో నిర్వహించిన సంఘం సమావేశంలో మాట్లాడారు. ఈనెల 24న దర్వేశిపురం క్షేత్రంలో అర్చక, ఉద్యోగ సంఘం చైర్మన్ ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశానికి జిల్లాలో 6ఏ,6బీ,6సీ ఆలయాల్లో పనిచేస్తున్న స్వీపరు నుంచి ప్రధాన అర్చకుల వరకు హాజరుకాలని కోరారు. సమావేశంలో దామోదర్‌రావు, ఉపేందర్‌రెడ్డి, కృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు, పద్మనాభా చార్యులు, మార్తిదుర్గాప్రసాద్, కుమ్మరికుంట్ల బదరీనారాయణా చార్యులు, ఆంజనేయాచార్యులు, రాజేష్, రమేష్, అంజి పాల్గొన్నారు.


