ఎవరైతే అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి
హుజూర్‌నగర్ : ఎవరు సర్పంచ్ అయితే గ్రామం అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించాలని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. సోమవారం హుజూర్‌నగర్ పట్టణంలో జర్నలిస్టులు, స్థానిక నాయకులతో కలిసి మంత్రి మార్నింగ్ వాక్ నిర్వహించారు. అనంతరం మంత్రి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి గుణగణాలు, సత్ప్రవర్తన, సేవా గుణం కలిగి అభివృద్ధి చేసేవ్యక్తిత్వం పరిశీలించి ఓటు వేయాలని కోరారు. ప్రలోభాలకు లోనైతే ఆ తర్వాత బాధపడేది మీరేనని ఆయన చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సులభం అవుతుందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రెండేళ్లలో వందల కోట్ల రూపాయలతో నూతనల్ లిఫ్ట్ ఏర్పాటుతోపాటు పాత లిఫ్టులు మరమ్మతులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తున్నామన్నారు. మార్నింగ్ వాక్‌లో పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, డీసీసీ కార్యదర్శి గెల్లి రవి, నాయకులు దొంగరి వెంకటేశ్వర్లు, జక్కుల మల్ల య్య, ముషం సత్యనారాయణ, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, కోడి ఉపేందర్ యాదవ్, కుక్కడపు మహేష్, యోహాన్, బెల్లకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
సూర్యాపేటలో స్థలం కేటాయించాలి
సూర్యాపేట పట్టణంలో ప్రభుత్వ పెన్షనర్ల సంఘానికి స్థలం కేటాయించాలని రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు రావిళ్ల సీతారామయ్య, జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు కోరారు. సోమవారం హుజూర్ నగర్‌లో మంత్రి ఉత్తమ్‌ను కలిసి పెన్షనర్ల సంఘం నేతలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థలం కేటాయిస్తే కార్యాలయం నిర్మించు కోవటానికి సిద్ధంగా ఉన్నా మన్నారు. కలెక్టర్‌కు సిఫార్సు చేయాలని కోరారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని, హెల్త్‌కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐదు డీఏలు పెండింగ్ లో పెట్టడం విచారకరం అని అన్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం నేతలు ఎంఎస్‌ఎ రాజు, వీరారెడ్డి పాల్గొన్నారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


