తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 89.69 శాతం పోలింగ్
తిరుమలగిరిలో 91.05 శాతం
పోలింగ్ నమోదు
మండలాల వారీగా పోలింగ్ వివరాలు
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఎనిమిది మండలాల్లో 152 పంచాయతీలు, 1,241 వార్డులకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు బారులుదీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించగా.. క్యూలైన్లలో ఉన్నవారికి అవకాశం కల్పించారు. దాదాపు 89.69 శాతం పోలింగ్ నమోదైందని, 2,05,583 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారులు వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పలు మండలాల్లో పర్యటించి పోలింగ్ సరళి, లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు.
గ్రామాల్లో పండుగ వాతావరణం
ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. చాలామంది ఓటర్లు బుధవారం రాత్రికే వివిధ ప్రాంతాల నుంచి పల్లెలకు చేరుకున్నారు. అభ్యర్థులు వలస ఓటర్లకు ప్రత్యేకంగా చార్జీలు చెల్లించి మరీ రప్పించారు. ఇక గురువారం ఉదయం నుంచే పోలింగ్ బూత్‌ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు భిన్నంగా పెద్దఎత్తున ఓటర్లు తరలివచ్చారు. హైదరాబాద్, చైన్నె తదితర పట్టణ ప్రాంతాల నుంచి వచ్చే ఓటర్ల వాహనాలతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. ఉదయం వేళ ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద ఉన్న టిఫిన్ సెంటర్లు కళకళలాడాయి. అభ్యర్థులు ఓటర్లను ప్రత్యేక వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఎన్నికల సిబ్బంది వికలాంగులు, వృద్ధులను వీల్‌చైర్లలో తీసుకెళ్లారు.
పోలింగ్ సరళి ఇలా..
తుంగతుర్తి, నాగారం, మద్దిరాల, తిరుమలగిరి, నూతనకల్, జాజిరెడ్డిగూడెం, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లో 2,29,222 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వీరి కోసం 1,403 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచే పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పంచాయతీలకు చేరుకుని పోలింగ్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ చేపట్టారు. ప్రతి కేంద్రం వద్ద ఓటర్లు బారులుదీరారు. ఉదయం 9గంటలకు 62,367 మంది ఓటు వేయగా 27.21 శాతం పోలింగ్ నమోదైంది. 11గంటల వరకు 61.75 శాతంతో 1,39,745 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒంటి గంటవరకు 87.77 శాతంతో 2,01,184 మంది, మొత్తంగా 89.69 శాతం నమోదైంది.
పురుషుల కంటే మహిళల పోలింగ్ అధికం
పురుష ఓటర్లు 1,13,812 మంది, మహిళా ఓటర్లు 1,15,410 మంది ఉన్నారు. మొదటి విడతలో మొత్తం 2,05,583 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,02,631 మంది ఓటు వేయగా 90.18 శాతం పోలింగ్ నమోదైంది. మహిళలు 1,02,948 మంది ఓటు వేయగా 89.20 శాతం పోలింగ్ నమోదైంది.
ఫ ఓటు హక్కు వినియోగించుకున్న 2,05,583 మంది ఓటర్లు
ఫ ఉదయం ఏడు గంటల నుంచే
కేంద్రాల వద్ద బారులు
ఫ తిరుమలగిరి మండలంలో
అత్యధికం, తుంగతుర్తిలో
అత్యల్ప ఓటింగ్
మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మండలాల వారీగా చూస్తే తిరుమలగిరి మండలంలో అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 15,979 మంది ఓటర్లు ఉండగా 14,549 మంది ఓటు వేశారు. పోలింగ్ శాతం 91.05 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జాజిరెడ్డిగూడెం మండలంలో 22,330 ఓట్లు పోలవ్వగా 90.72 శాతం పోలింగ్ నమోదైంది. ఆత్మకూర్‌లో 39,565 మంది ఓటువేయగా 89.81 శాతం, సూర్యాపేటలో 28,225 మంది ఓటువేయగా 90.30 శాతం, మద్దిరాలలో 22,467 మంది ఓటువేయగా 89.75 శాతం, నాగారంలో 22,091 మంది ఓటువేయగా 89.17 శాతం, నూతనకల్‌లో 26413 మంది ఓటువేయగా 90.87 శాతం, తుంగతుర్తిలో 29,943 మంది ఓటువేయగా 89.69 శాతం ఓట్లు పోలయ్యాయి.
మండలం ఓటర్లు పోలైనవి శాతం
ఆత్మకూర్ (ఎస్) 44,053 39,565 89.81
సూర్యాపేట 31,256 28,225 90.30
జాజిరెడ్డిగూడెం 24,615 22,330 90.72
మద్దిరాల 25,032 22,467 89.75
నాగారం 24,775 22,091 89.17
నూతనకల్ 29,066 26,413 90.81
తిరుమలగిరి 15,979 14,549 91.05
తుంగతుర్తి 34,451 29,943 86.91
మొత్తం 2,29,227 2,05,583 89.69
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 89.69 శాతం పోలింగ్
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 89.69 శాతం పోలింగ్
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 89.69 శాతం పోలింగ్
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 89.69 శాతం పోలింగ్
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 89.69 శాతం పోలింగ్
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో 89.69 శాతం పోలింగ్


