కాంగ్రెస్ మద్దతుదారుల విజయకేతనం
మండలాల వారీగా గెలుపొందిన స్థానాలు
భానుపురి (సూర్యాపేట) : మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల హవా కొనసాగింది. 152 గ్రామ పంచాయతీలకు 90 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. ప్రజావ్యతిరేకతతో తమకు కలిసొస్తుందని భావించిన బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆశించిన స్థానాలు కై వసం చేసుకోలేకపోయారు. కేవలం 52 స్థానాల్లోనే బీఆర్‌ఎస్ మద్దతుదారులు రాణించారు. ఇక బీజేపీ బలపరిచిన అభ్యర్థులు మూడు స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఇతరులు ఆరు స్థానాల్లో గెలుపొందారు. చాలా చోట్ల ఉపసర్పంచ్ ఎన్నికలు వాయిదాలు పడ్డాయి.
కలిసొచ్చిన పథకాలు
ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి పథకాలు కలిసొచ్చాయి. రెండేళ్లుగా పంచాయతీలకు ఎన్నికలు జరగపోవడంతో కొంత వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో భర్తీ చేసినట్లయింది. సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఉచిత కరెంట్ పథకాలే పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతుదారులు గెలిచేందుకు దోహదపడినట్లు ప్రచారం జరుగుతోంది.
కొన్ని ప్రాంతాల్లోనే బీఆర్‌ఎస్
బలపరిచిన అభ్యర్థుల ప్రభావం
కాంగ్రెస్ ప్రభుత్వంపై గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉందని, ఇదే అదునుగా అత్యధిక స్థానాల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తే.. రానున్న రోజుల్లో పార్టీకి పూర్వవైభవం వస్తుందని బీఆర్‌ఎస్ భావించింది. అయితే ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ప్రజల్లో మద్దతు లేకపోయింది. కొన్ని ప్రాంతాల్లోనే ప్రభావం చూపించింది. అది కూడా ఇతర పార్టీలు, వ్యక్తులతో పొత్తులే ఆ పార్టీకి కలిసొచ్చినట్లు చర్చించుకుంటున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోనూ ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదన్న భావన ఈ ఎన్నికల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది. ఒక్కో గ్రామంలో కనీసం మూడునాలుగు వార్డు మెంబర్లను గెలిపించేందుకు కూడా కష్టపడాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.
ఫ నాగారంలో మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి బీఆర్‌ఎస్ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందారు.
ఫ మద్దిరాల మండలం తూర్పు తండాలో సర్పంచ్ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ నడుమ జరిగాయి. ఇందులో బీఆర్‌ఎస్ అభ్యర్థి భూక్య వీరన్న సమీప ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
ఫ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సొంత గ్రామం బాలెంలలో బీఆర్‌ఎస్ పార్టీ దాదాపు 260 ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.
ఫ ఆత్మకూరు మండలం కోటినాయక్‌తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తులసికి, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ చిట్టికి సమానంగా ఓట్లు రాగా టాస్ వేశారు. ఇందులో ధరావత్ చిట్టికి అదృష్టం కలిసి రావడంతో సర్పంచ్‌గా గెలుపొందారు.
మండలం జీపీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
ఆత్మకూర్ (ఎస్) 30 15 12 02 01
తుంగతుర్తి 24 15 05 01 03
తిరుమలగిరి 16 12 03 00 01
మద్దిరాల 16 08 07 00 00
నూతనకల్ 17 07 07 00 01
నాగారం 14 10 02 00 01
సూర్యాపేట 25 15 08 00 01
జాజిరెడ్డిగూడెం 17 08 09 00 00
మొత్తం 159 90 53 03 08
(నాగారం మండలం ఈటూరులో అర్థరాత్రి దాటే వరకు రీకౌంటింగ్ కొనసాగింది)
ఫ మొదటి విడతలో 90 సర్పంచ్ స్థానాలు అధికార పార్టీ మద్దతుదారులు కై వసం
ఫ 53 స్థానాలకే పరిమితమైన బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులు
ఫ ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీ
కాంగ్రెస్ మద్దతుదారుల విజయకేతనం
కాంగ్రెస్ మద్దతుదారుల విజయకేతనం


