
బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవాలి
బీబీనగర్: కౌమార దశలో ఉన్న బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవాలని బీబీనగర్ ఎయిమ్స్ వైద్య కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అహంతెం శాంతాసింగ్ సూచించారు. స్వస్త్ నారీ, స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బీబీనగర్ గురుకుల ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రుతు పరిశుభ్రత, పోషకాహారం, రక్తహీనతపై విద్యార్థినులకు అవగాహన కల్పించి శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా విద్యార్థినులకు రంగోళి, చిత్రలేఖనం పోటీలు నిర్వహించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి మాధవీలత, ఎయిమ్స్ మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ అభిషేక్ అరోరా, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ భారతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బీసీ గురుకుల పాఠశాలలోని విద్యార్థినులకు కల్పిస్తున్న వసతులు, భోజనాన్ని పరిశీలించి ప్రిన్సిపాల్ మాధవికి పలు సూచనలు చేశారు.
ఫ బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్
డైరెక్టర్ అహంతెం శాంతాసింగ్