
సెల్‌ఫోన్లు అప్పగింత
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసిన సుమారు రూ.3.75లక్షల విలువైన 20 సెల్‌ఫోన్లను బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్‌లో బాధితులకు తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్‌స్పెక్టర్ ఎం. రమేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఎవరైనా తమ సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా, దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. సంబంధిత వివరాలు ఆయా పోలీస్ స్టేషన్‌లో నమోదువుతాయని పేర్కొన్నారు. సెల్‌ఫోన్ కొనుగోలు చేసిన సమయంలో తప్పనిసరిగా సంబంధిత బిల్లులు, ఐఎంఈఐ నంబర్లు భద్రపర్చుకోవాలన్నారు. పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు లక్ష్మీనారాయణ, జయరాజు, లక్ష్మీనర్సయ్య పాల్గొన్నారు.