నేడు మంత్రి ఉత్తమ్‌ రాక | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక

Jul 11 2025 5:35 AM | Updated on Jul 11 2025 5:35 AM

నేడు

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక

తిరుమలగిరి (తుంగతుర్తి) : ఈ నెల 14వ తేదీన నూతన రేషన్‌ కార్డుల పంపిణీ కి సీఎం రేవంత్‌రెడ్డి తిరుమలగిరికి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం రానున్నారు. ఈ సందర్భంగా సభాస్థలిని పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

ఏఐ జిల్లా కోఆర్డినేటర్ల నియామకం

నడిగూడెం : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత డిజిటల్‌ టెక్నాలజీ విస్తరణకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ఇద్దరు జిల్లా కోఆర్డినేటర్లను నియమిస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీచింగ్‌ విభాగం నుంచి నడిగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సివిక్స్‌ అధ్యాపకుడు కొల్లు శ్రీనివాస్‌, నాన్‌ టీచింగ్‌ విభాగం నుంచి నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సీనియర్‌ అసిస్టెంట్‌ భూక్యా అన్వేష్‌ను నియమించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో కొల్లు శ్రీనివాస్‌ను ప్రిన్సిపాల్‌ డి.విజయ నాయక్‌, అధ్యాపకులు అభినందించారు.

పాలకుల వైఫల్యాలను యువత ప్రశ్నించాలి

చివ్వెంల(సూర్యాపేట) : పాలకుల వైఫల్యాలను యువత ప్రశ్నించాలని ప్రగతి శీల యువజన సంఘం (పీవైఎల్‌) రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్‌. ప్రదీప్‌ అన్నారు. గురువారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో నిర్వహించిన ఆ సంఘం జిల్లాస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. యువత ప్రశ్నించకుండా గంజాయి, డ్రగ్స్‌లాంటి మత్తులో మునిగి పోయేలా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరుణాకర్‌, పరశురామ్‌, రమేష్‌ , సైదులు, రవి, మహేష్‌, శ్రవణ్‌, భవన్‌ కుమార్‌, నాగులు మీరా, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సూపరింటెండెంట్‌గా

బాధ్యతల స్వీకరణ

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గాంధీ ఆసుపత్రిలో పని చేసిన డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ సూపరింటెండెంట్‌గా పని చేసిన సత్యనారాయణ నల్లగొండ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా బదిలీపై వెళ్లిన విషయం విదితమే.

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం

మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శ్రీరాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం చేశారు. నూతన పట్టు వస్త్రాలంకరణ చేసి ఎదుర్కోళ్ల మహోత్సవం చేపట్టారు. అనంతరం కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అంతేగాక శ్రీస్వామి అమ్మవార్లను గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్‌, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌ కుమార్‌, రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక1
1/2

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక2
2/2

నేడు మంత్రి ఉత్తమ్‌ రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement