
మట్టపల్లిలో తొలి ఏకాదశి వేడుకలు
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం తొలిఏకాదశి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో మట్టపల్లికి చేరుకుని కృష్ణానదిలో పుణ్యస్నాణాలు ఆచరించారు. అనంతరం శ్రీస్వామివారిని, క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మట్టపల్లి క్షేత్రాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తలు, అర్చకులు ఆమెకు ఆలయ సంప్రదాయ పద్ధతులతో ఆహ్వానించారు. అనంతరం ధర్మకర్తలు, అర్చకులు ఆమెను సన్మానించారు. ఆలయ అభివృద్ధి పనులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, చెన్నూరు మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు పాల్గొన్నారు.
ప్రత్యేక పూజలు చేసిన
కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

మట్టపల్లిలో తొలి ఏకాదశి వేడుకలు