
25 శాతం పనులే పూర్తి
సూర్యాపేట అర్బన్ : అమృత్ 2.0లో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలో రూ.316 కోట్ల అంచనా వ్యయంతో 295 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు చేపట్టారు. కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ వారు టెండర్ దక్కించుకొని పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం 25 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారు. ఈ నిర్మాణ సంస్థ వారే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పూర్తి అయిపోయిన తర్వాత రోడ్లను కూడా మరమ్మతులు చేసే విధంగా టెండర్‌లో ఉంది.
డ్రెయినేజీ పేరుతో రోడ్లు ధ్వంసం
సూర్యాపేట మున్సిపాలిటీలో అమృత్ 2.0 కింద అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం రోడ్లన్నీ తవ్వేస్తున్నారు. పనులు పూర్తికాకపోవడంతో కాలనీ వాసుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. మొదటగా రోడ్డు మధ్యలో ప్రాంతాన్ని నిర్ణయించి హోల్స్ పెట్టేది ఒకరు, పెట్టిన హోల్స్ ప్రకారం రోడ్డును రెండుగా చీల్చేది మరొకరు, తదుపరి పైపులు వేసే వారు తర్వాత అక్కడ నిర్మించాల్సిన మ్యాన్‌హోల్స్‌కు మార్కింగ్ ఇస్తూ కట్టేవారు మరొకరు. ఈ ముగ్గురి మధ్యన మూడు ముక్కలాటగా రోడ్డు పనులు నత్తనడకన నడుస్తున్నాయి. అసలే వర్షాకాలం. అందులోనూ అన్ని రోడ్లన్నీ తవ్వి ఉండటంతో ఈ రోడ్ల ప్రయాణం సాగించాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు.
ఇబ్బందులు పడుతున్నాం
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పేరుతో రోడ్లన్నీ పగలగొట్టారు. పనులు పూర్తి చేయకుండా పెండింగ్‌లో ఉంచారు. బయటికి వెళ్లాలంటే ఏ గుంటలో పడతామోనని భయంగా ఉంది. వెంటనే పనులు పూర్తి చేయాలి.
– కనకటి రవి

25 శాతం పనులే పూర్తి