
ఎస్కేప్ షట్టర్‌లు బిగించేందుకు ఏర్పాట్లు
నడిగూడెం : నడిగూడెం మండలం కాగితరామచంద్రాపురం వద్ద సాగర్ ఎడమ కాల్వకు 132, 133 కిలోమీటర్ల వద్ద గతేడాది రెండు గండ్లు పడ్డాయి. దీంతో వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ గండ్లు పడడానికి పాలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ కాల్వలోకి వెనక్కి రావడం, ఎస్కేప్ షట్టర్లు సరిగ్గా లేకపోవడమేనని అధికారులు గుర్తించారు. దీంతో నీటిపారుదల శాఖ ప్రత్యేక నిధులతో 133 కిలోమీటర్ వద్ద ఎస్కేప్‌కు పాత షట్టర్లు తొలగించి, కొత్త షట్టర్లు అమర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో అత్యవసర సమయంలో నీటిని విడుదల చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.