చిన్నారిని ఎత్తుకొని.. ఆప్యాయంగా పలకరించి
నడిగూడెం : మోతె మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం–1ను కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ బుధవారం సందర్శించారు. అంగన్‌వాడీ కేంద్రంలోకి వచ్చిన కలెక్టర్‌కు చిన్నారి గుంటి తేజస్వని పాదాభివందనం చేసి, రెండు చేతులతో నమస్కారం చేసింది. దీంతో ముగ్ధుడైన కలెక్టర్ ఆ చిన్నారిని ఎత్తుకొని ముద్దాడి ఆప్యాయంగా పలకరించారు. చిన్నారిని పేరు అడిగి తెలుసుకున్న అనంతరం ఆమెను అభినందించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట అంగన్‌వాడీ కార్యకర్త పార్వతి, తదితరులున్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై శ్రద్ధవహించాలి
చివ్వెంల(సూర్యాపేట) : రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక శ్రద్ధవహించాలని కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ సూచించారు. బుధవారం చివ్వెంల మండల పరిధిలోని మర్కాల వెంకట్ రెడ్డి ఆయిల్ పాం తోటను సందర్శించి మాట్లాడారు. ఆయిల్‌పాం, మామిడి, కొబ్బరి, అన్ని రకాల పండ్లు, నాటుకోళ్లు, గొర్రెల పెంపకం, సమీకృత సాగు పద్ధతి తదితర వివరాలను రైతును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


