అభినందన సభను విజయవంతం చేద్దాం
కోదాడరూరల్ : సామాజిక ఉద్యమ వీరుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో బీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆత్మీయ అభినందన సభను విజయవంతం చేద్దామని ఆ సంఘ జాతీయ మహిళా అధ్యక్షురాలు భవాని చౌదరి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలో నిర్వహించిన వీహెచ్‌పీఎస్ జిల్లా సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. వికలాంగుల హక్కుల కోసం ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అనేక ఉద్యమాలు చేశారని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఆయన పోరాటాల ఫలితంగానే వికలాంగులకు పింఛన్‌ల పెంపు వంటి అనేక ప్రయోజనాలు కలిగాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు, వీహెచ్‌పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి పేరేల్లి బాబు, నాయకులు ఏపూరి రాజుమాదిగ, వీహెచ్‌పీస్ నాయకులు కర్ల విజయరావు, రావి స్నేహలతచౌదరి, పులి నాగేశ్వరరావు, అంజయ్య, మోషయ్య, గుర్వయ్య, కొండలు, మజహర్, అహ్మద్, అనీష్‌బేగం, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.


