పెట్టుబడి సాయం రూ.167.69కోట్లు
భానుపురి (సూర్యాపేట) : వానాకాలం – 2025 సీజన్‌కు సంబంధించి పంట పెట్టుబడి సాయం కింద సూర్యాపేట జిల్లాలో మూడు ఎకరాలలోపు వరకు ఉన్న 2,17,698 మంది రైతులకు రూ.167.69 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వ్యవసాయాన్ని పండుగలా మారుస్తూ, రైతులకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందని పేర్కొన్నారు. రైతుల బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే రైతు భరోసా పోర్టల్ లో నమోదు చేశారని తెలిపారు. పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించేందుకు రైతు భరోసా ఉపయుక్తంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఫ మూడు ఎకరాల లోపు ఉన్న 2,17,698 మంది రైతుల ఖాతాల్లో జమ
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


