అంగన్‌వాడీలకు విదు్యత్‌ వెలుగులు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు విదు్యత్‌ వెలుగులు

Jun 10 2025 3:14 AM | Updated on Jun 10 2025 3:14 AM

అంగన్

అంగన్‌వాడీలకు విదు్యత్‌ వెలుగులు

నాగారం, హుజూర్‌నగర్‌: అంగన్‌వాడీ కేంద్రాలు ఇక నుంచి పూర్వ ప్రాథమిక విద్యా కేంద్రాలు (ప్రీ ప్రైమరీ స్కూళ్లు)గా సేవలు అందించనున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు డిజిటల్‌ విధానంలో విద్యా బోధన అందించేందుకు ఆయా కేంద్రాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పటికే విద్యుత్‌ సౌకర్యం ఉన్నవి.. విద్యుత్‌ సౌకర్యం లేని అంగన్‌ వాడీ కేంద్రాల వివరాలను అధికారులు సేకరించారు.

477 కేంద్రాల గుర్తింపు

జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తుంగతుర్తి, చివ్వెంల ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,209 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. అయితే అద్దె, సొంత, పాఠశాల ప్రాంగణాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్‌ సరఫరా లేని భవనాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. వాటిలో సొంత భవనాలు ఉన్న కేంద్రాలు 313 కాగా ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్నవి 461 కేంద్రాలు ఉన్నాయి. అయితే ఇక అద్దె భవనాల్లో 435 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో విద్యుత్‌ సౌకర్యం ఉన్నవి 290, లేనివి 477 కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి విద్యుత్‌ శాఖకు నివేదికలు సమర్పించారు.

విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌

ప్రభుత్వ పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలకు ప్రతినెలా విద్యుత్‌ బిల్లులు చెల్లించడం భారంగా మారుతోందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల గుర్తించింది. అందులో భాగంగానే అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తిగా ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని సంకల్పించింది.

ఫ కరెంట్‌ సౌకర్యం లేని కేంద్రాలకు కనెక్షన్‌ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

ఫ ఇప్పటికే వివరాల సేకరణ పూర్తి

ఫ ఉన్నతాధికారులకు నివేదిక

పంపిన జిల్లా యంత్రాంగం

ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు 05

అంగన్‌వాడీ కేంద్రాలు 1,209

సొంత భవనాలున్నవి 306

అద్దె భవనాల్లో సాగుతున్నవి 452

పాఠశాలల్లో నిర్వహిస్తున్నవి 451

విద్యుత్‌ సౌకర్యం ఉన్నవి 732

విద్యుత్‌ సౌకర్యం లేనివి 477

అధికారులకు నివేదిక అందజేశాం

అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్‌ అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలకు గల విద్యుత్‌ సౌకర్యంపై సర్వే చేసి ఆ నివేదికను కలెక్టర్‌, విద్యుత్‌ శాఖ అధికారులకు అందజేశాం. అంగన్‌వాడీ కేంద్రాలకు అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాం.

– నరసింహారావు, జిల్లా సంక్షేమాధికారి

అంగన్‌వాడీలకు విదు్యత్‌ వెలుగులు1
1/1

అంగన్‌వాడీలకు విదు్యత్‌ వెలుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement