రేపు మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ రాక | - | Sakshi
Sakshi News home page

రేపు మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ రాక

Apr 24 2025 8:31 AM | Updated on Apr 24 2025 8:31 AM

రేపు

రేపు మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ రాక

నల్లగొండ: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ శుక్రవారం నల్లగొండకు రానున్నారు. ఉదయం 8గంటలకు హైదరాబాద్‌ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరి 10గంటలకు నల్లగొండలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌కు చేరుకుంటారు. 11:30గంటలకు జిల్లా జైలుఖానాను సందర్శిస్తారు. మధ్యాహ్నం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో భోజనం చేసి రాత్రి 7గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.

బుద్ధ జయంతికి రావాలని మంత్రి జూపల్లికి ఆహ్వానం

నాగారం: ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో మే 12న నిర్వహించనున్న బుద్ధ జయంతి వేడుకలకు రావాలని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును హైదరాబాద్‌లో కలిసి ఆహ్వాన పత్రం అందించినట్లు బోధిసత్వ ఫౌండేషన్‌ అధ్యక్షుడు పులిగిల్ల వీరమల్లుయాదవ్‌ తెలిపారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో వీరమల్లుయాదవ్‌ మాట్లాడుతూ... ఫణిగిరి బౌద్ధ క్షేత్రం విశిష్టతను ప్రపంచానికి చాటిచెప్పేలా బుద్ధ జయంతి రోజున ప్రపంచ సుందరీమణులతో హెరిటేజ్‌ వాచ్‌ కార్యక్రమం నిర్వహించాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి జపాల్‌లోని హిరోషిమా ప్రభుత్వంతో బౌద్ధ వారసత్వ సంపదను కాపాడుకోవాలని నిర్ణయించడం సంతోషదాయకమన్నారు.

కుటుంబ తగాదాలతో దాడి

ఇద్దరికి గాయాలు

నకిరేకల్‌: కుటంబ తగదాల కారణంగా అత్త, ఆమె తమ్ముడిపై అల్లుడు దాడి చేసి గాయపర్చాడు. ఈ ఘటన నకిరేకల్‌ పట్టణంలోని తాటికల్‌ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌ పట్టణంలోని తాటికల్‌ రోడ్డులో నివాసముంటున్న బోయింద జానమ్మకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెను సూర్యాపేటకు చెందిన పెరుమాళ్ల రవికి ఇచ్చి వివాహం చేసింది. భార్యాభర్తల మధ్య తగదాలు రావడంతో జానమ్మ నల్లగొండ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో అల్లుడిపై మంగళవారం ఫిర్యాదు చేసింది. మంగళవారం రాత్రి 12గంటల సమయంలో అల్లుడు రవితో పాటు మరో వ్యక్తి చింతమల్ల రాహుల్‌ జానమ్మ ఇంటికి వచ్చి ఆమెతో పాటు ఆమె తమ్ముడు ఎడ్ల ప్రకాష్‌పై దాడి చేసి గాయర్చారు. బుధవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చారి తెలిపారు.

సీహెచ్‌సీని సందర్శించిన వరల్డ్‌ బ్యాంక్‌ బృందం

ఆలేరురూరల్‌: ఆలేరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌(సీహెచ్‌సీ)ని వరల్డ్‌ బ్యాంక్‌ బృందం సభ్యులు డాక్టర్‌ రమణ, డాక్టర్‌ కృష్ణ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా రోగులుకు అందుతున్న ఆరోగ్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డెలివరీ కేసుల గురించి వివరాలు అడిగారు. రోగులకు అందిస్తున్న సేవలు, మంచి ఆహారం అందిస్తున్నారా అని ఆరా తీశారు. డాక్టర్లకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ సుమన్‌, కళ్యాణ్‌, డాక్టర్‌ యశోదా, డాక్టర్‌ శిల్ప, డీపీఓ నెహ్రూ, సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ స్వప్న, రజిని, రామ కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

రేపు మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ రాక1
1/1

రేపు మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement