‘రాజీవ్ యువ వికాసం’ గడువు పొడిగింపు
భానుపురి: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జగదీశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పొడిగించిన తేదీలోగా ఆన్‌లైన్ వెబ్‌సైట్ పోర్టల్/ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏదైనా సందేహాలు ఉంటే జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ 08684 231023, 9492611057 నంబర్లను కార్యాలయ వేళల్లో సంప్రదించాలని కోరారు.
గోదావరి జలాలు పెంపు
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు అదనంగా మరో విడత గోదావరి జలాలను బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తొలి రోజు 1000 క్యూసెక్కుల నీటిని వదలగా గురువారం 1,325 క్యూసెక్కులకు పెంచారు. ఇందులో 69 డీబీఎంకు 500 క్యూసెక్కులు, 70 డీబీఎంకు 25 క్యూసెక్కులు, 71 డీబీఎంకు 800 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నట్లు బయ్యన్నవాగు డీఈఈ ఎం.సత్యనారాయణ తెలిపారు. రైతులు కాలువలకు గండ్లు పెట్టి నష్టం కలిగించకుండా గోదావరి జలాలను వాడుకోవాలని సూచించారు.
వైభవంగా
నారసింహుడి కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషే కాలు, హోమం జరిపారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణం జరిపి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు.
ఆస్తిపన్ను వసూళ్లలో
నేరేడుచర్లకు ప్రథమ స్థానం
నేరేడుచర్ల: గడిచిన ఆర్థిక సంవత్సరం (2024–25)కు సంబంధించి మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లాలోనే నేరేడుచర్లకు ప్రథ మ స్థానాన్ని దక్కింది. మొత్తం 80.45 శాతం పన్ను వసూలు చేసి మిగతా మున్సిపాలిటీల కంటే ముందంజలో నిలిచింది. ఇందుకు కృషిచేసిన నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్‌రెడ్డిని అభినందిస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఆస్తిపన్ను వసూలు చేసిన అధికారుల, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
‘రాజీవ్ యువ వికాసం’ గడువు పొడిగింపు
‘రాజీవ్ యువ వికాసం’ గడువు పొడిగింపు


