రాబోయేది మన పార్టీ ప్రభుత్వమే..ఎంపీ ఉత్తమ్ | - | Sakshi
Sakshi News home page

రాబోయేది మన పార్టీ ప్రభుత్వమే..ఎంపీ ఉత్తమ్

Oct 12 2023 4:40 AM | Updated on Oct 12 2023 11:39 AM

- - Sakshi

కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

సూర్యపేట్‌: వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం మఠంపల్లి మండలం బక్కమంతుల గూడేనికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు చింతారెడ్డి విజయ భాస్కర్‌రెడ్డి, అనుచరుల కుటుంబాల వారు హుజూర్‌నగర్‌లోని ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌లో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్‌లో చేరిన వారిలో ఉప సర్పంచ్‌ వి. నాగలక్ష్మి, నాయకులు వి. సైదులు, కో– ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌. సీతారామి రెడ్డి, ఐ. చిన శంభిరెడ్డి, జి. వీరస్వామి, బి. ఉపేందర్‌ రెడ్డి, ఎన్‌. బొర్రయ్య, టి. కోటయ్య, కె. నాగయ్య, నర్సింహ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు కోతి సంపత్‌రెడ్డి, మంజూ నాయక్‌, ఎస్‌. గోవింద రెడ్డి, వై .నర్సింహారావు, ఎస్‌. వెంకట్‌ రెడ్డి, జి. నాగిరెడ్డి, చంద్రం, వీర నాగిరెడ్డి, రాజ మోహన్‌ రెడ్డి, పూర్ణ చందర్‌ రావు పాల్గొన్నారు.

అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల అమలు
కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ఎంపీ ఉత్తమ్‌ చెప్పారు. బుధవారం హుజూర్‌నగర్‌లోని ఎంపీ క్యాంప్‌ కార్యాలయంలో ఆరుగ్యారంటీల ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఆరు గ్యారంటీలను గడపగడపకూ తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు బి. గిరిబాబు, వీరారెడ్డి, శివరాం, మల్లయ్య, గురవయ్య, యో హాన్‌, రామాంజి, వెంకన్న, చందు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement