ఫ జెడ్పీ సీఈఓ సురేష్
మునగాల(కోదాడ): గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించే నర్సరీల్లో వేసవిలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని జెడ్పీ సీఈఓ జి.సురేష్ అన్నారు. బుధవారం మండలంలో గణపరవం, కొక్కిరేణి, తిమ్మారెడ్డిగూడెం, మునగాల, బరాఖత్‌గూడెం, ఆకుపాముల, కృష్ణానగర్, నారాయణగూడెం, కలకోవ గ్రామాల్లో నర్సరీలను పరిశీలించారు. గణపవరం లో మన ఊరు – మనబడి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీపీ ఎలక బిందు, ఎంపీడీఓ బి.వెంకటేశ్వర్లు, ఎంపీఓ భూపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు , పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.