కొండమల్లేపల్లి : గుర్తుతెలియని వ్యక్తులు షాపింగ్ కాంప్లెక్స్‌లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కొండమల్లేపల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండమల్లేపల్లికి చెందిన శ్రీనివాస్, వెంకటేశ్‌లు తమ తల్లిదండ్రులు సంపాదించిన ఖాళీ స్థలంలో 9 ఏళ్ల క్రితం షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. అక్కడ వ్యాపారం అనుకూలించకపోవడంతో నాలుగు సంవత్సరాల క్రితం ఓ ప్రజాప్రతినిధికి విక్రయించారు. అంతేకాకుండా తమకు సంబంధించిన ఒక బీరువా, కొంత చిల్లర సామగ్రి ఆ కాంప్లెక్స్ సెల్లార్‌లోని ఓ చిన్న గదిలో ఉంచి వెళ్లిపోయారు. కాగా, ఇటీవల కొందరు వ్యక్తులు బీరువా పగులగొట్టి అందులోని ఆభరణాలను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్, వెంకటేశ్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు దుండగులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. అయితే, అవి నకిలీ బంగారు ఆభరణాలు కావని రోల్డ్‌గోల్డ్ అని పేర్కొన్నారు. బీరువాలో ఉన్నది బంగారం అని పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉండడం గమనార్హం.