
కుడకుడ గ్రామంలోని బస్తీ దవాఖానాలోవైద్య సేవలు పరిశీలిస్తున్న కలెక్టర్ వెంకట్రావు
చివ్వెంల(సూర్యాపేట) : మహిళలకు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని కలెక్టర్ ఎస్. వెంకట్రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో బస్తీ దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహిళా ఆరోగ్య కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రతి మంగళవారం జిల్లాలో నిర్దేశించిన అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మహిళలు తమ ఆరోగ్య సమస్యలకు సేవలు పొంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నారు. హాస్పిటల్‌కు వచ్చే ప్రతి మహిళను క్షుణ్ణంగా పరిశీలించి వారి సమస్యలను వైద్య సిబ్బంది తెలుసుకుని సేవలు అందించాలన్నారు. మహిళలు క్యాన్సర్, బీపీ, షుగర్, గర్భాశయ వ్యాధులను నిర్ణీత సమయంలో గుర్తించి చికిత్స పొందాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణి చేయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి కోటాచలం తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ వెంకట్రావు