సోనూ మనసు బంగారం 

Sonu Sood Adopted Three Born Babies In Ballari - Sakshi

సాక్షి, బళ్లారి : ప్రముఖ నటుడు, సినిమాల్లో విలన్‌గా అందరినీ విసిగించే సోనూ సూద్‌ నిజజీవితంలో దాతృత్వానికి ఎల్లలు లేకుండా పోతున్నాయి. ఎక్కడ కష్టం ఉందని తెలిసినా నేనున్నానని సహాయ హస్తం అందిస్తున్నారు. గత శనివారం కన్నడనాట యాదగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ పేద మహిళ పద్మ ఒకే కాన్పులో ముగ్గురు మగబిడ్డలకు జన్మనిచ్చింది. పూట గడవక కష్టాలు పడుతున్న పద్మ– నాగరాజ్‌ దంపతులకు ముగ్గురు బిడ్డలను పోషించడం తలకు మించిన భారమైంది. పాడుబడిన చిన్న ఇంటిలో బతికేదెలా అని ఆ దంపతులు మొరపెట్టుకున్నారు. ఈ విషయమై పత్రికలు, టీవీ చానెళ్లలో వచ్చిన వార్తలు సోనూ సూద్‌ దృష్టికి వెళ్లగా ఆయన వెంటనే మానవతను చాటుకున్నారు. ఆ ముగ్గురు శిశువులను దత్తత తీసుకుంటానని, వారి పోషణకు, పద్మ ఇల్లు మరమ్మతులకు ఖర్చులను తాను భరిస్తానని హామీ ఇచ్చి తన ఉదారత చాటుకున్నారు.   

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top