25 నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

25 నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

25 నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

పాతపట్నం: పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి దేవస్థానం 51వ వార్షిక నవరాత్రి యాత్రా మహోత్సవాలు సంద ర్భంగా ఈ నెల 25 నుంచి 27 వరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌, రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షులు అక్కందర సన్యాసిరావు, ఎన్ని శేఖర్‌బాబు తెలిపారు. గురువారం ఆల య ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడుతూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు నిర్వహిస్తామని, ఆసక్తి గల జట్లు 9393946424 నంబరుకు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు సుదర్శనరావు, ఆలయ కమిటీ సభ్యులు, పీడీలు, పీఈటీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement