శ్రీకాకుళం: రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారం కోరుతూ ఈ నెల 18న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావాలి శ్రీనివాస్, పప్పల తిరుమలరావు తెలిపారు. గురు వారం వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన న్యాయపరమైన సమస్య ల సాధనకు ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పా రు. 12వ పీఆర్‌సీ 2023 జూలై 1 నుంచి అమ లు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని, 11వ పీఆర్‌సీ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.


