డీఈఈ సెట్‌–2026కు దరఖాస్తులకు గడువు పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

డీఈఈ సెట్‌–2026కు దరఖాస్తులకు గడువు పొడిగింపు

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

ఆర్టీవో గంగాధర్‌కు జాతీయ అవార్డు

గార: జిల్లాలోని ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ వమరవల్లిలో రెండేళ్ల ప్రాథమిక విద్యలో డిప్లమో కోర్సు ప్రవేశం కోసం దరఖాస్తులకు గడువు పొడిగించారని డైట్‌ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఎ.గౌరీశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు ప్రిన్సిపాల్‌ ఎ.గౌరీశంకర్‌ 9492848205, జీవీ రమణ 9491843995 లకు సంప్రదించాలన్నారు.

రిమ్స్‌ ఎక్స్‌రే విభాగంలో షార్ట్‌ సర్క్యూట్‌

శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్‌ సర్వజన ఆస్పత్రిలో గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగిన మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఓ టేబుల్‌, కంప్యూటర్‌ మానిటర్‌ కాలిపోయాయి. ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమా దం తప్పింది. పొగలు రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చా రు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రసన్నకుమార్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ సుభాషిని, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్‌ సీపీ శ్రీదేవి గదిని పరిశీలించారు.

నేడు అర్జీల స్వీకరణ

మెళియాపుట్టి: మండలకేంద్రంలో శుక్రవారం గ్రీవెన్స్‌ ద్వారా సమస్యల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీతంపేట ఐటీడీఏ పీఓ స్వప్నిల్‌ పవార్‌ ఒక ప్రకటన ద్వారా గురువారం తెలిపారు. కార్యక్రమంలో నేరుగా ఆయనే సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు.

ప్రజాస్వామ్యం ఖూనీ

హిరమండలం: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యు రాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టును ఆమె తీవ్రంగా ఖండించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా పూడి శ్రీహరిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ కక్షల కోసం పోలీసు వ్యవస్థను పావుగా వాడుకుంటున్నారని తెలిపారు.

శ్రీకాకుళం రూరల్‌: శ్రీకాకుళం ఆర్టీవో అధికారి పి.వి.గంగాధర్‌కు రోడ్‌సేఫ్టీ అవేర్‌నెస్‌తో పాటు పబ్లిక్‌ అవుట్‌రీచ్‌లో మంచి ప్రతిభ కనపర్చినందు కు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. ఇటీవల బెంగళూరులోని ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ మోటార్‌ వెహికల్స్‌ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక రవాణా శాఖమంత్రి రామలింగారెడ్డి ఈ అవార్డును ప్రదానం చేశారు.

కార్మికుల సంక్షేమానికి దరఖాస్తుల ఆహ్వానం

వజ్రపుకొత్తూరు రూరల్‌: భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్మిక శాఖాధికారి పి.విజయ్‌కుమార్‌ తెలిపారు. మార్చి 1 నుంచి నాలుగు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సంక్షేమ నిధి ద్వారా కార్మిక శాఖలో సభ్యత్వం పొందిన అర్హులైన ప్రతి కార్మికుల కుటుంబానికి వివాహ కానుకగా రూ. 20 వే లు, ప్రసూతి సాయం రూ.20 వేలు, సహజ మరణానికి రూ. 60 వేలు కాగా అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ.20 వేలు అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు కాశీబుగ్గలో ఉ న్న కార్మిక శాఖను లేదా 94925 55040 ఫోన్‌ నంబర్‌ ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement