శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

న్యూస్‌రీల్‌

ఎండల్లో చల్లటి నేస్తం

శుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

ఎండలు ఠారెత్తుతున్నాయి. అడుగు బయట పెడితే చాలు ఒంటిలోని నీరంతా చెమటలా బయటకు పోతోంది. ఎండల వేడిని తగ్గించేందుకు తాటి ముంజెలు వచ్చేశాయి. పోషకాల గనిగా పేరొందిన ఈ ముంజెలు ఇప్పుడు విరివిగా లభ్య

మవుతున్నాయి. తాటిముంజల్లో శరీరానికి చలువ చేసే గుణాలు ఉండటంతో కొనేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రస్తుతం డజన్‌ రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. వ్యాపారులకూ లాభసాటిగా ఉండడంతో దాదాపు ప్రతి జంక్షన్‌లోనూ తాటి ముంజెలు కనిపిస్తున్నాయి.

పోషకాలు మెండు..

తాటి ముంజెలు శరీరంలో నీటిశాతాన్ని పెంచుతాయి. ఎండ వేడిమికి గురికాకుండా కాపాడతాయి. వీటిలో విటమిన్‌ ఏ, బి, సీలతో పాటు శరీరానికి కావాల్సిన జింక్‌, పొటాషియం, పాస్పరస్‌, ఐరన్‌ ఉంటాయి. ట్యూమర్లు, క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి. పొటాషియం అధికంగా ఉండటంతో రక్తపోటు తగ్గించి శరీరంలో మలినాలను బయటకి పంపుతుంది. కడుపు ఉబ్బరం, వికారం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.

–హిరమండలం

Advertisement
 
Advertisement
Advertisement