శ్రీకాకుళం న్యూకాలనీ: నిరుద్యోగ యువతీయువకుల కోసం శనివారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రలోని బలగ హాస్పటల్ జంక్షన్‌లో ఉన్న డీఎల్‌టీసీ/ఐటీఐ శిక్షణా కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి జాబ్‌మేళా జరుగుతుందన్నారు. ఈ జాబ్‌మేళాను మిడ్‌ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్, ఐ స్మార్ట్ సొల్యూషన్స్ సంస్థ, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీ కోసం చేపడుతున్నట్టు ఆమె పేర్కొన్నారు.
● మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాల కోసం ఇంటర్ /ఐ.టి.ఐ /డిప్లమో వి ద్యార్హత కలిగి ఉన్న, 18–29 మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు, ఎంపికై న వారు శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, సాలూరు, ఇచ్చాపురం, పాలకొండ, కోటబొమ్మాళి, విజయ నగరంలలో పని చేయాల్సి ఉంటుంది. 150 ఫీల్డ్ ఆఫీసర్, సెంటర్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు రూ.12వేల నుంచి రూ.18వేల వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు లభిస్తాయి.
● ఐ స్మార్ట్ సొల్యూషన్స్ సంస్థలో ఉద్యోగాల కోసం ఇంటర్ ఆపైన విద్యార్హత కలిగి, 20–35 మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువత అర్హులు. 75 టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో పనిచేయాల్సి ఉంటుంది. జీతం నెలకు రూ.8వేల నుంచి రూ.12వేల వరకు ఉంటుంది.
● అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలో ఇంటర్ ఆపైన విద్యార్హత కలిగి ఉన్న, 20–30 మధ్య వయస్సు గల యువతీ యువకులకు 120 ఖాళీల కు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, పలా స, సోంపేట, పార్వతీపురం, రాజాం, విజయనగరంలలో పనిచేయాల్సి ఉంటుంది. జీతం రూ.16 వేల నుంచి రూ.35వేల వరకు ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌సీఎస్.జీవోవి.ఇన్ వెబ్‌పోర్టల్ లో అభ్యర్థులు వివరాలు నమోదు చేసుకోవాలి.


