శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పీఏసీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌యాదవ్‌తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్య కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, వెలమకుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు ఆరంగి మురళి, పొందర కుల రాష్ట్ర అధ్యక్షుడు రాజాపు అప్పన్నలు తదితరులు సత్కరించి జ్ఞాపిక అందజేశారు.


