నాలుగు గంటల పాటు తిలక్‌ విచారణ | - | Sakshi
Sakshi News home page

నాలుగు గంటల పాటు తిలక్‌ విచారణ

Apr 17 2026 10:56 AM | Updated on Apr 17 2026 10:56 AM

టెక్కలి: వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ను గురువారం టెక్కలి పోలీసులు నాలుగు గంటల సేపు విచారించారు. దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణంపై మంత్రి కె.అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఇటీవల వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీనిపై టెక్కలి పోలీసులు తిలక్‌కు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై ఈ నెల 13న టెక్కలి పోలీస్‌ స్టేషన్‌కు తిలక్‌ హాజరయ్యారు. మళ్లీ రెండో దఫాగా గురువారం సాయంత్రం 4 గంటల తర్వాత విచారణకు హాజరయ్యారు. రాత్రి 8 గంటల వరకు విచారణ కొనసాగించారు. ఆయనతో పాటు నందిగాం ఎంపీపీ ఎన్‌.శ్రీరామ్ముర్తి, నాయకులు ఎస్‌.సత్యం, టి.కిరణ్‌, చిన్ని జోగారా వు, కె.జీవన్‌ ఉన్నారు. ఇదిలా ఉండగా తిలక్‌ స్టేషన్‌కు హాజరవుతున్న నేపథ్యంలో పట్టణంలో పలు జంక్షన్ల వద్ద పోలీసులు పహరా కాశారు.

Advertisement
 
Advertisement
Advertisement