జలుమూరు: భూముల రీ సర్వే అనంతరం ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి రైతులకు తప్పులు లేని పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. గురువారం అక్కురాడలో రీ సర్వేపై అధికారులు, రైతులతో మాట్లాడారు. అక్కురాడ పరిధిలోని 924 ఖాతాల్లో ఇప్పటి వరకూ 45 ఖాతా లను మాత్రమే సరిచేయడం జరిగిందన్నారు. మిగిలిన ఖాతాల్లో తప్పులు సరిదిద్దడంపై జాప్యంపై అధికారులతో మాట్లాడారు. సర్వే లోపాలను సవరించేందుకు మండల,సచివాలయ అధికారు లు సమన్వయంతో సనిచేయాలని సూచించారు. ప్రధానంగా అక్షర దోషం లేని పాస్ పుస్తకాలు రైతులకు అందించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. దీని కోసం ప్రతి ఖాతాను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.


