టెక్కలి: ఇటీవల సత్యసాయి జిల్లాలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ బూట్ క్యాంప్‌లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కళాశాలలో బుధవారం వారిని అభినందించారు. ఏఐసీటీఈ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 250 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. వారిలో ఆదిత్య విద్యార్థులు మైరెన్ ఎక్స్, కాష్యుహబ్, ఎఫీసోల్వో తదితర ఇన్నోవేషన్ ప్రాజెక్టులతో పాల్గొన్నట్లు వెల్లడించారు. కాష్యు హబ్‌కు జ్యూరీ ప్యానెల్ ఉత్తమ జట్టు అవార్డు, ప్రశంసా పత్రాలు అందజేసినట్లు తెలిపారు. అలాగే ఎఫీసోల్వోకు ప్రశంసపత్రాలు అందజేశారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఐతమ్ రైజ్ సీఈవో మనోజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


